image
If U Love Our Site Refer to Ur Friends

Home | Telugu Music World | Telugu 2016 Mp3 Songs | DJ Remix Songs (zone) | Telugu Old Songs (A to Z) | Telugu Videos World
Download Songs From Our New Downloading Site :- TeluguGama.In

Chiranjeevi, Balakrishna, Prabhu Deva, ANR, Sr NTR Telugu Old Mp3 Songs
Tungabhadra Movie Telugu Review And Rating

లెజెండ్ చిత్రంతో గతేడాది సక్సెస్ ను స్టార్ట్ చేసిన వారాహి చలనచిత్రం తర్వాత ఉహలు గుసగుసలాగే, దిక్కులు చూడకు రామయ్య వంటి వరుస విజయాలతో హ్యట్రిక్ కొట్టారు.
అటువంటి సక్సెస్ పుల్ బ్యానర్ లో ఈ ఏడాది విడుదలైన తొలిచిత్రం తుంగభద్ర.
డిఫరెంట్ స్టోరీలను సెలక్ట్ చేసుకుని వాటితో సక్సెస్ కొట్టిన సాయికొర్రపాటి వారాహి చలనచిత్రం మరి ఈ తుంగభద్రలో ఏం చెప్పాలనుకున్నారో తెలయాలంటే కథ తెలుసుకోవాల్సిందే...

కథ

సినిమా కర్లపూడి అనే గ్రామంలో ప్రారంభమవుతుంది. త్రిమూర్తులు(చలపతిరావు) ఎలక్షన్స్ లో పోటీ చేస్తాడు.
ఆ సమయంలో జరిగిన గొడవల్లో రామరాజు(సత్యరాజ్) త్రిమూర్తిని చంపేస్తాడు.
అతని ముగ్గురు కొడుకులు రామరాజుపై కక్ష కట్టి జరిపిన ఎదురు దాడిలో శ్రీను(ఆదిత్) తండ్రి రామరాజు ప్రాణానికి తన ప్రాణం అడ్డువేసి కాపాడి చనిపోతాడు.
అప్పటి నుండి గొడవలు పెద్దవి కావడం, రామరాజు పార్టీ ప్రజా దేశం అధికారంలోకి రావడంతో త్రిమూర్తులు కొడుకులు అడవుల్లోకి పారిపోతారు.
శ్రీనుని రామరాజు చెరదీసి పెంచుతాడు. ఓ సందర్భంలో శ్రీను రామరాజు కుమార్తె గౌరి(డింపుల్ చోపడే)ను ఫాలో చేయాల్సి వస్తుంది. అలా నెమ్మదిగా గౌరి, శ్రీనులు ప్రేమలో పడతారు.
మరి వీరి ప్రేమ విషయం తెలిసిన రామరాజు ఏం చేస్తాడు? త్రిమూర్తులు కొడుకులు చివరికి రామరాజుపై పగ సాధిస్తారా అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్లస్ పాయింట్స్

ఈ సినిమాలో సత్యరాజ్, ఆదిత్ మంచి నటనను కనపరిచాడు. లవర్ బోయ్ లా కనిపించే ఆదిత్ ఈ సినిమాలో రఫ్ లుక్ తో అలరించాడు.
సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరి ఇరవై నిమిషాల సినిమానంతా తనే మోశాడు.
సెకండాఫ్ లో లోకల్ పాలిటిక్స్ తో సినిమా రన్ స్పీడ్ గా ఉంటుంది. డింపుల్ చోపడే తన క్యారెక్టర్ కి న్యాయం చేసింది.
పల్లెటూరి అమ్మాయి గెటప్ లో చూడటానికి బాగుంది. హరిగౌర సంగీతం పరావాలేదు. క్లయిమాక్స్ లో వచ్చే రాక్షసాన రణ రంగమే..,
తరిమే పంతం ..., మోంటేజ్ సాంగ్స్, కళ ఇది సాంగ్స్ విజువల్ గా కథలో భాగంగా ఉండటంతో బావున్నట్లపించింది.
రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి సీన్ ను ఫ్రెష్ గా చూపించాడు.

మైనస్ పాయింట్స్

అసలు టైటిల్ లో సినిమాలో కథకు సంబంధం లేదా అనిపిస్తుంది.
తుంగ, భద్ర అనే రెండు నదులు కలిసి తుంగభద్ర అనే నదిగా ఏర్పడినప్పుడు ఆ రెండు ఉప నదులు పక్కనున్న మనుషులు మాత్రం ఎందుకు కలవరో అని యూనిట్ వారు చెబితే గానీ తెలియడం లేదు.
కనీసం సినిమా స్టార్టింగ్ లో ఆ వాక్యాలను చెప్పి ఉంటే బావుండేది. డైరెక్టర్ శ్రీనివాస్ కృష్ణ తమిళ సినిమాలు చూసి కథ రాసుకున్నట్లు కనపడుతుంది.
ఫస్టాఫ్ అంతా య‌జ్ఞం సినిమాని గుర్తుకు తెస్తుంది. అది కాకుండా సినిమా స్లోగా నడుస్తుంది. కథతో పాటు, కథనం విషయంలో గ్రిప్పింగ్ సాగలేదు.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరి చెప్పాలనుకున్న డైరెక్టర్ పోలిటికల్ విషయాలు పెట్టిన శ్రద్ధ లవ్ ట్రాక్ పై పెట్టలేదు.
కథలో భాగంగా కామెడి ట్రాక్ పెద్దగా లేదు. సినిమా మధ్యలో ఇరికించిన సప్తగిరి కామెడి కొద్దిగా నవ్వించింది.

విశ్లేషణ

పోలిటికల్ బ్యాక్ డ్రాప్ సాగే కక్షలు, పగలు, ప్రతీకారాలపై సినిమాలు ఇప్పటికే చాలా వరకు తెలుగు ప్రేక్షకులు చూసేశారు కాబట్టి ఈ సినిమాలో దర్శకుడు కొత్తగా చెప్పిందేమీ లేదు.
అసలు కథలో హీరోతో సహా చాలా మంది గడ్డాలతో కనపడటంతో సినిమా తెలుగు నెటివిటీ కాకుండా తమిళ నెటివిటీ కనపడుతుంది.
అలాగే ఆదిత్ రోల్ ప్రీ క్లయిమాక్స్ తో ముగిసిపోతుంది. నిజం చెప్పాలంటే ఆదిత్ తన పాత్ర వరకు న్యాయం చేశాడు కానీ తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి.
హరిగౌర సంగీతం, రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ సినిమాకి బలం అయితే వీక్ కథ, కథనం వీక్ పాయింట్స్. సినిమాని ఓసారి చూడవచ్చు.

బాటమ్ లైన్: సెకండాఫ్ తో ‘తుంగభద్ర’ గట్టెక్కేస్తుంది

రేటింగ్: 3/5
Latest Top Downloads
Jr NTR's Jai Lava Kusa Teaser 3Gp,Mp4,HD
Baahubali 2 Full Video Songs 3gp, Mp4, HD
Radha Full Mp3 Songs Download All Songs Added
Saaho Official Teaser Download 3gp,Mp4,HD
Baahubali 2 (2017) Full Songs All Songs Added
Quick Navigation
DJ Remix Songs | Telugu Mp3 Songs | Telugu HD Videos | Telugu 2016 Video Songs
Search Telugu Mp3 Songs and Videos Here
⇑ Home | ↩ Back | Top ^
© TeluguXtra.In ™ ® 2014 - 2018
users online

:=:

Telugu Movie
Download Android Game for Free
UC Browser  Android Games  New Apps  more