image
If U Love Our Site Refer to Ur Friends

Home | Telugu Music World | Telugu 2016 Mp3 Songs | DJ Remix Songs (zone) | Telugu Old Songs (A to Z) | Telugu Videos World
Download Songs From Our New Downloading Site :- TeluguGama.In

Chiranjeevi, Balakrishna, Prabhu Deva, ANR, Sr NTR Telugu Old Mp3 Songs
ఫిబ్రవరి 6న 'గడ్డం గ్యాంగ్'

డా॥ రాజశేఖర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గడ్డం గ్యాంగ్‌’. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ‘సూదుకవ్వమ్‌’ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
శ్రీమతి జీవిత రాజశేఖర్‌ సమర్పణలో శివాని, శివాత్మిక మూవీస్‌ బ్యానర్‌పై సంతోష్‌ పీటర్‌ జయకుమార్‌ దర్శకత్వంలో శివాని, శివాత్మికలు నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
అచ్చు సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై శ్రోతల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది.
కాగా ఫిబ్రవరి 4న డా॥ రాజశేఖర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా...డా॥రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ ఎవడైతే నాకేంటి, గోరింటాకు చిత్రాల తర్వాత ఆ స్థాయిలో విజయాలను ప్రేక్షకులకు అందించలేదు.
అందుకనేఈ ఫిబ్రవరి 4న నా పుట్టినరోజు అయినప్పటికీ 6వ తేదినే నా అసలైన పుట్టినరోజుగా భావిస్తున్నాను.
ఎందుకంటే ఫిబ్రవరి 6న గడ్డం గ్యాంగ్‌ విడుదలకు సిద్ధం అవుతుంది. డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో, డిఫరెంట్‌ జోనర్‌లో ఈ గడ్డంగ్యాంగ్‌ సినిమా చేశాను. ఇప్పటి వరకు విలన్ల వెంటపడే రాజశేఖర్‌ను చూశారు.
అయితే ఈ సినిమాలో పోలీసుల నా వెంటపడుతుంటారు. ఇందులో కొత్త రాజశేఖర్‌ను చూస్తారు. ఈ సినిమాలో ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్‌ చేశాను.
ఈ చిత్రానికి డబ్బింగ్‌ కూడా నేనే చెబుతామనుకున్నాను. ట్రైలర్‌లో నా వాయిస్‌ను వినవచ్చు. సాయికుమార్‌గారైతే ఈ సినిమాకి నా గొంతైతే కరెక్ట్‌గా సరిపోతుందని భావించి, నన్నే డబ్బింగ్‌ చెప్పమన్నారు.
అయితే ఇప్పటి వరకు ప్రేక్షకులు సాయికుమార్‌ గొంతుతోనే నన్ను ఆదరిస్తున్నారు. ఈ సినిమా నాకు చాలా కీలకంగా భావించాను.
అందుకనే నేను రిస్క్‌ చేయలేదు. ఈ సినిమాలో అసలు హీరో స్రిప్ట్‌. అవుటండ్‌ అవుట్‌ వండర్‌ఫుల్‌ స్క్రీన్‌ప్లే ఉంటుంది. అచ్చు సంగీతంతో పాటు ఇందులో ఓ కీలకపాత్రలో నటించారు.
మంచి మ్యూజిక్‌ ఇవ్వడంతో పాటు చక్కగా యాక్ట్‌ చేశాడు. డైరెక్టర్‌ సంతోష్‌కుమార్‌, డెమల్‌ ఫోటోగ్రఫీ సహా అందరూ టెక్నిషియన్స్‌ ఈ సినిమా కోసం బాగా పనిచేశారు.
అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధానకారణం జీవిత. తను ఈ సినిమా బాగా రావాలని మా అందరి కంటే సినిమా బాగా రావాలని కష్టపడిరది.
ఈ నెల 6న విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను’’ అన్నారు.

జీవిత మాట్లాడుతూ ‘‘గడ్డంగ్యాంగ్‌ అల్రెడి ప్రూవ్‌డ్‌ మూవీ. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సినిమా రైట్స్‌ కొన్న దగ్గర నుండి ఫస్ట్‌ కాపీ వరకు చాలా కష్టపడ్డాం.
డైరెక్టర్‌ సంతోష్‌ చక్కగా డైరెక్ట్‌ చేశారు. అచ్చు సంగీతం అందించడమే కాకుండా ఫస్ట్‌టైమ్‌ మా చిత్రంలోనే యాక్ట్‌ చేశారు.
ఈ సినిమాలో ఒక డిఫరెంట్‌ రాజశేఖర్‌ను చూస్తారు. ఈ ఫిబవ్రరి 6న సినిమా విడుదల కానుంది’’ అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అచ్చు మాట్లాడుతూ ‘‘గడ్డం గ్యాంగ్‌ డిఫరెంట్‌ ఆడియో. ఈ సినిమా కోసం ప్రతి ఒకరూ చాలా హార్డ్‌ వర్క్‌ చేశాం.
సంగీతం అందించడంతో పాటు ఇందులో ఒక కీలకపాత్ర చేశాను. అలాగే నా పాత్రకి నేను డబ్బింగ్‌ కూడా చెప్పుకున్నాను.
ఈ సినిమాలో స్టోరీనే హీరో. కంప్లీట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. తప్పకుండా అందరికీ నచ్చే మూవీ అవుతుంది’’ అన్నారు.

డైరెక్టర్‌ సంతోష్‌ జయకుమార్‌ మాట్లాడుతూ ‘‘ఫిబ్రవరి 6న సినిమాని విడుదల చేయబోతున్నాం. ఇదొక డిఫరెంట్‌ జోనర్‌ మూవీ.
సరికొత్త రాజశేఖర్‌గారిని చూస్తారు. ఒక గ్రూప్‌ ఎలాంటి పనులు చేసిందో అదే సినిమా. తప్పకుండా అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Latest Top Downloads
Jr NTR's Jai Lava Kusa Teaser 3Gp,Mp4,HD
Baahubali 2 Full Video Songs 3gp, Mp4, HD
Radha Full Mp3 Songs Download All Songs Added
Saaho Official Teaser Download 3gp,Mp4,HD
Baahubali 2 (2017) Full Songs All Songs Added
Quick Navigation
DJ Remix Songs | Telugu Mp3 Songs | Telugu HD Videos | Telugu 2016 Video Songs
Search Telugu Mp3 Songs and Videos Here
⇑ Home | ↩ Back | Top ^
© TeluguXtra.In ™ ® 2014 - 2018
users online

:=:

VidMate
Download Android Game for Free
9Apps  Phone  IMO  more